Thursday, September 19, 2019

ఈశ్వరుడు, భ్రహ్మ సైతం నీవేనని

నిప్పుకు శుద్ది అవసరం లేదు

నీ ఆత్మ నిప్పు వంటిదైనప్పుడు
నీ మాటలు ఎకార్ధాలైనప్పుడు
నీ కళ్ళలో బెరుకు లేనప్పుడు
నీ భావం నిజమైనదైనప్పుడు

నీవే పరమాత్మ అంశవని
నీకర్ధమవుతుంది
నీవే మూల కారణమని
బోధపడుతుంది

ఆ ఈశ్వరుడు, భ్రహ్మ సైతం
నీవేనని తెలుస్తుంది
మంచి చెడు
నిమిత్తమాత్రులై మలిన పడిన
మానవ నిర్మితాలని తెలుస్తుంది

ఆరోజు నీ ఆత్మకు శుద్ది అవసరం ఉండదు

Friday, September 13, 2019

విధి లిఖితమైనది జీవితం

విధి లిఖితమైనది జీవితం
ఎన్ని మలుపులో
ఎన్ని మార్పులో

మార్చగలమనే భ్రమలో మనం
ఈ భ్రమ కూడా లిఖితమేనేమో

వెలుగు వ్యత్యాసాన్ని చూపుతుంది
చీకటి సమానత్వాన్ని నెర్పుతుంది
నేనున్నచోట అంతా ఒకటే అంటుంది

అంతరార్ధం తెలియని మనం
చీకటిని దూషిస్తాం, వెలుగును ఆశ్రయిస్తాం
ఎంత విచిత్రమైంది ఈ విధి

తెలివితేటలు ఉన్నవారిని సైతం
తికమక పెడుతుంది
క్షణికావేశాలకు లోను చేస్తుంది
అసలైన మిత్రులను శత్రువులనిపిస్తుంది
శత్రుసమూహాన్ని మిత్రులుగా కలుపుతుంది

ఇది నిమిత్తమాత్రం అని
లోకానికి తెలిసేదెప్పుడు ?
హహ్హ
విధి లిఖితం లో ఆ పుట లేదేమో !
తెలియాలని లిఖితమవలేదెమో !

-
Ven G Sharma