Friday, March 7, 2014

కూతురి విషయం లో తండ్రి ? కొడుకు విషయంలో తండ్రి ?

నాకెప్పుడూ ఒక సందేహం ఉండేడి...సాదారణంగా ఒక తండ్రి ఎవరి పట్ల జాగ్రత్త వహిస్తుంటాడు అని.ఈ సందేహానికి నాకు సమాధానం దొరికింది.మొన్నామద్య ఒకరొజు నేను మా అన్నయ్య కలిసి పునుగులు తిందామని తోపుడు బండి దగ్గరకి వెళ్ళాం.ఆర్డెర్ ఇచాం. వాడు ప్రిపేర్ చేస్తున్నాడు.ఈ లోపు నేను అటుగా వచ్చే పోయే వాళ్ళని చూస్తున్నాను.

ఇంతలో అకడికి ఒక రిచ్ ఫ్యామిలీ వచ్చింది...అతనికి ఇద్దరు కూతుళ్ళు.చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు.వాళ్ళు కూడా పునుగులు తినటానికి వచ్చారు.
పిల్లలు పునుగులు తింటుంటే తండ్రి సపరి చర్యలు చేస్తున్నాడు.తల్లి మాత్రం షాపింగ్ చేసిన వాటిని మరల మరల సర్ది చూసుకుంటోంది.
నాకు నవ్వు వచ్చి మనసులో నవ్వుకున్నాను.పిల్లలు తినటం ఐపొయాక వాళ్ళు వెళ్ళిపోయారు.

మరికొద్దిసేపటికి అక్కడికి మరొక తండ్రి తన కుతురితో పునుగులు తినటానికి వచ్చాదు.మళ్ళీ నా కళ్ళ ముందు అదే జరుగుతోంది...ఈ తండ్రి ధనవంతుడు కాదు.
తన కూతురుని ముందు కూర్చొనబెట్టుకోని సైకిల్ మీద వచాడు.కానీ అదే జాగ్రత్త, ప్రేమ చూసాను...నాకు ఆ తండ్రీ కూతుళ్ళని చూసి ముచ్చటేసింది.

కానీ అసలు నా ప్రశ్నకి సమాధానం దొరికింది ఇప్పుడే...ఇంకొక తండ్రి తన కొడుకుని తీస్కుని వచ్చాడు.ఇకడ మొదలైంది కామెడీ...ఆ తండ్రీ కొడుకుల సంభాషణ ఇలా ఉంది...

తండ్రి: అలా కాదు నాన్నా..!! మంచిగా తిను..కొడుకు: నాకు తెలుచు తినటం.తండ్రి: చేతులు పైకి అనుకుని తిను నాన్నా..! (సర్దుతూ)కొడుకు: లే డాడీ.. నన్ను తిననీ... లే (విసుక్కుంటూ..)

ఇది చిన్న సంభాషణ అయినా కానీనాకు బాగ అర్ధం ఐంది ఎమిటంటేఒక కూతురు అర్దం చేసుకున్నంతలా కొడుకు తండ్రి ప్రేమకి కనెక్ట్ అవలేడు కదా అని...

హహ్హహ్హా...కూతురి విషయం లో తండ్రి తన కూతురు జగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తే...కొడుకు విషయంలో తండ్రి అలా అలోచించటానికి ట్రై చేయాలనుకుంటాడు.కానీ కొడుకు ఆ ఆలోచనని మార్చేసి,మిగిలిన వాళ్ళందరూ తన కొడుకుతో జాగ్రత్తగా ఉండాలి అని అలోచించేలా చేస్తాడు.

ఏదేమైనా తండ్రీ కూతుళ్ళ సంబంధం చాల క్యూట్ గా ఉంటుంది.20యేళ్ళ తర్తువాత వదిలి వెల్లిపోతుందని తెలిసి,తన కూతురి కళ్ళలో ఎప్పుడూ ఆనందమే చూడాలి అనుకునే ఆ తండ్రి తపన.ఆ ప్రేమకి జోహార్లు... _/\_